నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 ః గురుకులంలోని విద్యార్థులు వ్యక్తిగత పారిశుద్ధ్యం పాటించి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోసువారిపల్లి పీహెచ్సీ డాక్టర్ షణ్ముఖ సూచించారు. శనివారం ఎస్టి గురుకులంలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు హిమ గ్లోబిన్ తో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పారిశుధ్యం తో పాటు తరగతి గదులు, పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని,తాగునీరు కాచి వడబోసి తాగాలని తరచూ ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దగ్గు, జలుబు లకు మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో గురుకుల ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణనాయక్, వైద్య, గురుకుల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News