Thursday, 30 July 2026 07:52:16 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో మార్చ్ 7న ‘టెక్నోఫిలియా 2K26’ టెక్నికల్ ఫెస్ట్

Date : 03 March 2026 07:45 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో మార్చ్ 7న ‘టెక్నోఫిలియా 2K26’ టెక్నికల్ ఫెస్ట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల మెరుగుదలకు వేదికగా పేపర్ నోవా, ప్రాజెక్ట్ ఎక్స్‌పో పలు పోటీలు – ఆకర్షణీయ బహుమతులు విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో 2026 మార్చ్ 7వ తేదీన “టెక్నోఫిలియా 2K26” పేరిట టెక్నికల్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల యాజమాన్యం శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి ప్రకటించారు. ఈ టెక్ ఫెస్ట్‌కు డా. వసంత సెల్వకుమార్ మరియు డా. బి. సురేష్ బాబు కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన సాంకేతిక పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా Paper Nova (పేపర్ ప్రెజెంటేషన్), Poster Conclave, Quiz Byte, Decode, Jam Session, Project Expo, C Thunders వంటి ఈవెంట్లు విద్యార్థుల సాంకేతిక ప్రతిభను వెలికి తీసేలా రూపొందించబడ్డాయి. ఈ టెక్నికల్ ఫెస్ట్‌లో అన్ని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. పాల్గొనే విద్యార్థుల కోసం నమోదు ఫీజు రూ.100 మాత్రమేగా నిర్ణయించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు మరియు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ ఫెస్టులు ఎంతో ప్రాధాన్యత కలవని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, బృందపని మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందిస్తాయని తెలిపారు. అంతేకాకుండా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో టెక్ ఫెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. “టెక్నోఫిలియా 2K26” టెక్నికల్ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని, ఈ అవకాశాన్ని అన్ని ఇంజినీరింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :