Friday, 31 July 2026 10:40:48 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

భవన కార్మికుడు బలవన్మరణం కుటుంబంలో విషాదం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువుల విజ్ఞప్తి

Date : 14 May 2026 03:02 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవన కార్మికుడు బలవన్మరణం కుటుంబంలో విషాదం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువుల విజ్ఞప్తి విశాలాంధ్ర, మదనపల్లి: మదనపల్లె పట్టణంలో భవన కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం వెలుగు చూసింది. రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక నిమ్మనపల్లె రోడ్డు దిగువ కమ్మపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న లేట్ నరసింహులు కుమారుడు అగరం సూరి(45) భవన కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో ఏ కారణంతోనో మనస్తాపానికి గురైన సూరి తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని, కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :