Friday, 31 July 2026 10:39:07 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఆర్. నడింపల్లె, కాప్పల్లి లో స్వామిత్వ గ్రామసభలు

Date : 22 November 2025 06:00 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : రామసముద్రం మండలంలోని కాప్పల్లె, ఆర్. నడింపల్లె గ్రామ పంచాయతీల సచివాలయలలో శనివారం సర్పంచ్ లు నారాయణమ్మ తిప్పరాజు, నడింపల్లె ఉపసర్పంచ్ రాజేశ్వరి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ నారాయణమ్మ తిప్పరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని నేను పంచాయతీకి సహాయ సహకారాలు అందిస్తాని ఆయన తెలిపారు , పంచాయతీ ఎదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. టిడిపి నాయకులు కోవా కృష్ణమూర్తి,లోక రాజు, నడింపల్లె రమేష్, గంగప్ప రెడ్డెప్ప మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో పంచాయతీ లను అభివృద్ధి చేస్తామన్నారు . డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీల్లోని పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు 9(2) తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీలు సాకేమ్మ, సుబ్బారెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, తిప్పరాజు, ఉపసర్పంచ్ రాజేశ్వరి, కోవాకృష్ణమూర్తి, లోకరాజు, నడింపల్లె రమేష్, వెంకటేష్, ఆర్. వేణు గోపాల్ రెడ్డి రహమతుల్లా, శ్రీనివాసులు, రెడ్డెప్ప,ఎం ఆర్ పి యస్ భాస్కర్ రెడ్డెప్ప వెంకటరమణ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: