Friday, 31 July 2026 08:51:28 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ISTE అవార్డు అందుకొన్న మిట్స్ విద్యార్థి

Date : 08 July 2026 11:11 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 08 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ISTE)-2025, ఆంధ్రప్రదేశ్ విభాగం ఇటీవల ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మక విద్యార్థి అవార్డులను అందుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్ (AITAM) కళాశాలలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ సీఎస్‌ఈ స్టూడెంట్ అవార్డును ఎం. హర్షితా రెడ్డి, బెస్ట్ ఈసీఈ స్టూడెంట్ అవార్డును ఎ. సత్య ప్రియ, బెస్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అవార్డును కె. మహమ్మద్ అజ్మతుల్లా, బెస్ట్ స్టూడెంట్ ఇన్నోవేటర్ అవార్డును సీఎస్‌ఈ విభాగానికి చెందిన గోర్ల తేజ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్‌టీయూఏ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ సాంకేతిక విద్యాభివృద్ధికి ఐఎస్టీఈ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో యువత విశేష ప్రతిభ కనబరచాలని అన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రతాప్‌సింహ్ కాకాసాహెబ్ దేశాయ్ (ప్రెసిడెంట్, ISTE, న్యూఢిల్లీ), ప్రొఫెసర్ జి. రంగ జనార్దన్ (చైర్మన్, ISTE), ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి (సెక్రటరీ, ISTE-ఆంధ్రప్రదేశ్), డాక్టర్ పొట్లూరి రవీంద్ర బాబు, ప్రొఫెసర్ టి.ఎస్.ఎస్. బాలాజీ, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి (నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ISTE) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎస్టీఈ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి మిట్స్ విద్యార్థులు అవార్డులు అందుకోవడం యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. అవార్డులు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఐఎస్టీఈ కోఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీ దివ్య, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :