నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం -మార్చి 29 : శ్రీరామనవమి తిరుణాళ్ళు పుష్ప పల్లకిఊరేగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఎర్రబోయిన పల్లె గ్రామం లో నిర్వహించిన శ్రీ కోదండ రామ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు శంకర స్వామి స్వామి వారిని దర్శనం కల్పించి వేదమంత్రాలతో ఆశీర్వచనంతో దీవించారు. ఈసందర్భంగా మల్లెలపవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని, ఇలాంటి మహోత్సవాలు సమాజంలో భక్తి, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముడి మార్గాన్ని అనుసరించాలని కోరుతూ గ్రామ ప్రజలకు శ్రీరామ నవమి తిరుణాలు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Reporter
Namitha News