Friday, 31 July 2026 01:41:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు

Date : 03 May 2026 08:44 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధర-జల హారతి కార్యక్రమం విజయవంతనికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఇచ్చిన ఆదేశాలతో తంబళ్లపల్లె మండలంలో జలధార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పాల్గొని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత శనివారం జిల్లా పిడి కోసువారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను పరిశీలించి సంతృప్తి చెంది ఇదే ఊపు కొనసాగించాలని ప్రోత్సహించారు. మండలంలో జలధార కార్యక్రమం విజయవంతానికి ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్ తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో జలధార కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని గుండ్లపల్లి, గోపి దిన్నె, ఆర్ ఎన్ తాండా, కోటకొండ, కుక్క రాజు పల్లి, రేణుమాకులపల్లి, పంచాయతీలలో సైతం పెద్ద ఎత్తున కూలీలు హాజరై జలధార కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల పరిధిలోని చిన్నేరు వాగు తో పాటు పలు చెరువుల అనుసంధాన కాలువల పనులు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు, పార్ జంగిల్ క్లీనింగ్,కు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసి పనులు చేపట్టాలని స్థానిక చెరువు సంఘం అధ్యక్షులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :