Sunday, 02 August 2026 03:40:22 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

Date : 30 April 2026 08:09 PM Views : 153

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్‌సీసీ విభాగానికి చెందిన క్యాడెట్లు అడ్వెంచర్ క్యాంపులో విశిష్ట ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఎన్‌సీసీ విభాగం నుండి వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సా అనే ఇద్దరు విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని మనాలి లో గల అటల్ బిహారి వాజపేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ నిర్వహించిన పది రోజుల అడ్వెంచర్ క్యాంపులో పాల్గొన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ సాహస క్రీడల శిక్షణా కేంద్రంగా పేరుపొందిన ఈ సంస్థలో రాక్ క్లైంబింగ్, రాపెలింగ్, రివర్ క్రాసింగ్ వంటి సాహస కార్యక్రమాలతో పాటు సుమారు 10,200 అడుగుల ఎత్తులో పర్వతారోహణ (మౌంటెన్ ట్రెక్కింగ్) నిర్వహించబడగా, మౌంటెన్ రెస్క్యూ విధానాలపై కూడా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ఇలాంటి కఠిన శిక్షణల ద్వారా క్యాడెట్లలో ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, దేశ సేవకు సిద్ధమయ్యే గుణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతి క్యాడెట్ దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. 2 నుండి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో 10 రోజులపాటు కష్టపడి శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి సర్టిఫికెట్లు అందుకున్న క్యాడెట్లు వై. హర్షిత, ఎస్.కె. సానియా హఫ్సాలను యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో చాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మరియు ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మౌనిష్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లోగనాధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :