Thursday, 30 July 2026 10:30:19 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో జనసేన బలోపేతానికి కృషి చేయండి - జేఎస్పీ డీలిమిటేషన్ కమిటీ సభ్యులు

Date : 09 May 2026 09:04 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 09 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తంబళ్లపల్లె ఇన్చార్జి పోతుల సాయినాథ్ కు రాష్ట్ర డీలిమిటేషన్ కమిటీ సభ్యులు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంతపురం అర్బన్ ఇన్చార్జి టి.సి వరుణ్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ లు సూచించారు. శనివారం తిరుపతి లో డి లిమిటేషన్ కమిటీ సభ్యులను తంబళ్లపల్లె ఇంచార్జ్ సాయినాథ్, ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎద్దుల నరసింహులు ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు,సమస్యలను కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తో సమన్వయపరచుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత, పొత్తులో పార్టీ సముచిత స్థానం తో పాటు జనసైనికుల ఆకాంక్షలు, ప్రజల ఆదరాభిమానాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సహకారంతో జనసైనికులు విజయ బావుటా ఎగరవేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సత్ఫలితాలు సాధించాలని ఉత్తేజపరిచారు. వారి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పార్టీ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :