Thursday, 30 July 2026 08:51:20 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా డి.యం.హెచ్.ఓ. ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

Date : 23 January 2026 07:10 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 23 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో వద్ద డి.యం.హెచ్.ఓ. ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మీ నరసయ్య గారి ఆధ్వర్యంలో కార్యాలయంలోని అన్ని విభాగాల ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్బంగా డి.యం.హెచ్.ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, స్వేచ్ఛాయుతంగా మరియు భయరహితంగా ఓటు హక్కును వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన ప్రోగ్రాం అధికారులు , అన్నీ విభాగల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :