Thursday, 30 July 2026 12:01:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పోలీసులకు ఆయుధ నైపుణ్యం తప్పనిసరి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఫైరింగ్ రేంజ్ పాల్గొన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 06 February 2026 08:02 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 06 : రాయచోటి పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి వృత్తి నైపుణ్య పరీక్షలు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆయుధమే కవచమని, దాని వినియోగంపై ప్రతి ఒక్కరికీ తిరుగులేని పట్టు ఉండాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. శుక్రవారం కడప శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఏఆర్ ‘మొబిలైజేషన్’ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు ఎస్పీ గారు. స్వయంగా రంగంలోకి దిగి ఏకే-47, ఎస్ఎల్ఆర్, మరియు అత్యాధునిక గ్లాక్ పిస్టల్‌తో లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి అందరినీ అశ్చర్యపరిచారు. ఎస్పీ గారి ఫైరింగ్ ప్రతిభను చూసి అక్కడి సిబ్బంది ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఆయుధాన్ని వాడటం అంటే కేవలం కాల్చడం మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎంత వేగంగా స్పందిస్తామనేదే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి ప్రత్యేక వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్క్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్ తో సిబ్బంది చురుకుదనాన్ని పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలను అతి తక్కువ సమయంలో విడదీయడం, తిరిగి అమర్చడం వంటి అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిడిని జయించేందుకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే మన ప్రథమ కర్తవ్యం. ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరంతర సాధన ద్వారానే వృత్తిపరమైన మెళకువలు సొంతమవుతాయి" అని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గారు, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర గారు, రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఏఆర్ డిఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి గారు మరియు ఇతర పోలీసు అధికారులు, ఏఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :