Friday, 31 July 2026 06:33:48 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత

కిషోర్, కొండ్రెడ్డి ఫ్లెక్సీ ల చించివేత - నిందితులను అరెస్టు చేయాలని ధర్నా-ఉద్రిక్తత-స్తంభించిన ట్రాఫిక్

Date : 17 April 2026 08:50 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 17 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి, టిడిపి నాయకుల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. క్రాస్ రోడ్ లో గురువారం రాత్రి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర టిడిపి కన్వీనర్ మద్దిరెడ్డి కొండ్రెడ్డిల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. ఈ విషయమై శుక్రవారం రాష్ట్ర టిడిపి కార్యదర్శి కొండ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కార్యకర్తలతో క్రాస్ రోడ్ లో వాహనాల అడ్డం పెట్టి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ఫ్లెక్సీల చించివేత తెలుసుకున్న పలు మండలాల నుండి స్వచ్ఛందంగా వాహనాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కొండ్రెడ్డి స్వగృహం చేరుకొన్నారు. అక్కడి నుండి కొండ్రెడ్డి టిడిపి కార్యకర్తలతో ర్యాలీగా పాత బస్టాండ్ మీదుగా క్రాస్ రోడ్డు చేరుకొని మొలకలచెరువు క్రాస్ రోడ్డుకు అడ్డంగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జిందాబాద్, కొండ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఫ్లెక్సీలుచించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన రహదారిలో ధర్నా జరుగుతుండడంతో ఆర్టీసీ సర్వీసులు, వాహనాలతో పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కొండ్రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మా ఫ్లెక్సీలు చించివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైనా దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోవాలని ఫ్లెక్సీల మీద ప్రతాపం చూపడం పిరికి బంధ చర్యగా అభివర్ణించారు. ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్టు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఈ ఆందోళన కార్యక్రమాల్లో నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: