Monday, 03 August 2026 06:47:31 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కోసువారి పల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుడిగాలి పర్యటన

Date : 22 April 2026 08:58 PM Views : 374

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తంబళ్లపల్లె లోని ఆయన స్వగృహం నుండి కోసువారిపల్లి పంచాయతీ తరుగువారిపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆతిథ్యం స్వీకరించి ఆకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థత గురై కాలు పోగొట్టుకున్న శేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి కోసువారి పల్లెకు చెందిన మాజీ మల్లయ్య కొండ ఆలయ కమిటీ మెంబర్ మిల్ట్రీ రెడ్డప్ప రెడ్డి సతీమణి అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి మెరుగైన చికిత్సలు చేయించాలని సూచించారు. రెడ్డప్పరెడ్డికి నీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం నూరిపోశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ముందు ముందు మంచి రోజులు వస్తాయని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, బొట్టు శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,చక్రపాణి, బావ జాన్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :