Friday, 31 July 2026 12:41:56 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అధునాతన సాంకేతికతతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ - భూ వివాదాలకు చెక్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రైతుల భూ సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 02 January 2026 07:22 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 02 : మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి లో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ రెవిన్యూ సదస్సు లో రైతులకు ఆధునాతన టెక్నాలజీ తో రూపొందించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ నూతన పట్టాదారు పాసు పుస్తకాలతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆధునిక సాంకేతికత జోడింపుతో భూ వివాదాలకు చెక్ పెట్టగలుగుతామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం అంకి శెట్టిపల్లి గ్రామంలో మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. మదనపల్లె మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ముఖ్యమైన సమస్య భూ సమస్య అని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను మరియు వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. ఈ అధునాతన సాంకేతికతతో సెంటీమీటర్ కూడా తేడా జరగకుండా రి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది తదితర అంశాలను చాలా స్పష్టంగా మరియు సులభంగా గుర్తించగలుగుతామన్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం... యాదృచ్ఛికంగా ఈ ప్రాంతంలో ముఖ్య సమస్య అయిన భూ సమస్యపైనే మొదటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని భూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక నాందిగా ఉంటుందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వాటిని అర్జీ పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ...మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని అంకి శెట్టిపల్లి గ్రామంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని అందించిన నేల మదనపల్లి అని, ఎటువంటి ఉపోద్ఘాతము అవసరం లేదు ప్రాంతం మదనపల్లి అని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం తోనే రైతులు ఆనందంగా ఉంటారని, కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వం డీకేటి భూములను స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డీకేటి భూములను భూమిలేని రైతులకు అందించిందని ఎంతో పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మదనపల్లె వాసుల కోరిక మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి, అని వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :