Thursday, 30 July 2026 10:15:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ లో సైబర్ నేరాలు, అరికట్టే పద్ధతులు పై చర్చలు, పరస్పర ఒప్పందాలు

ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్

Date : 06 November 2025 07:25 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు ఐఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశం పై హాండ్స్ ఆన్ వర్కుషాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎమ్.శ్రీ లక్ష్మి ప్రీతీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజు కు సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు, సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముక్యంగా సమస్యను అర్థం చేసుకొని వాటికి పరిష్కరాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణం అని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్‌లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టమ్‌లను నెట్‌వర్క్ నుండి వేరుచేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్‌ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :