Friday, 31 July 2026 12:44:41 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లి లో ఎరవుల దుకానాలు తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు - ఏ.డి.ఈ. రమణరావు

Date : 05 December 2025 08:43 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఎరువుల దుకాణదారులు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పీలేరు వ్యవసాయ శాఖ ఏడిఈ రమణరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఏవో రమణకుమార్ తో కలసి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలో అమ్మకాలు, కొనకాల రిజిస్టర్లు, ప్రస్తుత నిల్వ,తూనికల మిషన్లు పరిశీలించారు. దుకాణాలలో అమ్ముతున్న ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్మకాల పై స్థానిక రైతులను, వినియోగదారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవో రమణ కుమార్ మాట్లాడుతూ మండలంలోని రబీ రైతులకు వేరుశెనగ విత్తన కాయలు ఎన్ని కావాలన్నా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రైతన్నా.. మీకోసం కార్యక్రమం ద్వారా అవగాహన పొంది రైతులు పంట మార్పిడి, ఆరుతడి పంటలు, ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. వారి వెంట గ్రామ వ్యవసాయ అధికారులు లు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, కావ్య తదితరులు ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :