నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో గురువారం రాత్రి ఓ భవన కార్మికుడు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక చంద్ర కాలనికి చెందిన రామాంజులు (25) రోజు మాదిరిగా భవన నిర్మాణ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వాస్మోల్ తాగడంతో పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం రుయా ఆసుపత్రికి తరలించారు.
Reporter
Namitha News