నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివ స్ కార్యక్రమాన్ని విజయపథంలో నిలవడానికి సమిష్టి కృషి చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. శనివారం ఎంపీడీవో ఆధ్వర్యంలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు, అధికారులు తంబళ్లపల్లె పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎంపీడీవో మాట్లాడుతూ పారిశుద్ధ్యం పాటించి ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పెంపుకు మొక్కలు నాటడం చేపట్టాలన్నారు.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతానని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీకుమార్,ఏపిఎం గంగాధర్,ఏపిఓ అంజనప్ప, ఐటిఐ ప్రిన్సిపల్ నాగరాజు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, హెచ్ ఎం రెడ్డప్ప రెడ్డి, సీసీలు కత్తి నరసింహులు, రమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి,పద్మావతి,భాస్కర్ విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News