నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 11 ః తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బ్యాంకులు రైతులు, మహిళ సంఘాలు, కక్షిదారులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వాలంబన కోసం సహకరించాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి ఆంజనేయులు సూచించారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో త్రైమాసిక ఆర్థిక లావాదేవీల పై బ్యాంకు అధికారులు, పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు మాసాల రైతులు, మహిళా సంఘాలు, ఇతరత్రా రుణాల పంపిణీ, రికవరీలపై ఆరా తీశారు. బ్యాంకు లింకేజీలు, కిసాన్ కార్డులు, పశు కిసాన్ కార్డులు,రబీ క్రాప్ ఇన్సూరెన్స్, సి సి ఆర్ సి, ఉదయం రిజిస్ట్రేషన్, తోబాటు పిఎం ఈజీపి, పి ఎం ఎం వై, పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజిలి యోజన, పీఎం విశ్వకర్మ, ముద్ర హ్యాండ్లూమ్ రుణాలు, పి యం డిడి కే వై మరియు పీఎం స్వనిధి పథకాల రుణాలపై వివరణ అడిగారు. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించి సైబర్ నేరాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వపరంగా అర్హులైన వారికి రుణ పంపిణీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రమణ కుమార్, ఐకెపి ఎపిఎం గంగాధర్, నియోజకవర్గంలోని బ్యాంకు మేనేజర్లు, పశువైద్య జె.వి.ఓ కిరణ్, వ్యవసాయ శాఖ ఏఈఓ సురేష్, సి.సి.లు కత్తి నరసింహులు, రమణ, అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News