Thursday, 30 July 2026 08:13:16 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వడ్డే ఓబన్న స్ఫూర్తితో మన హక్కులు కాపాడుకుందాం - వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున

Date : 25 January 2026 08:32 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 25 : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తితో ప్రతి వడ్డెర కులస్తుడు తమ హక్కులు కాపాడుకోవడానికి కలిసి రావాలని వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున పిలుపునిచ్చారు. ఆదివారం వడ్డెర సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా వడ్డెర సంఘం అన్ని రంగాలలో వెనుకబాటుతనం తో మగ్గిపోతున్నారని భావితరాల భవిష్యత్తు కోసం వడ్డెర్లు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామస్థాయి నుండి వడ్డెర సంఘం ఏర్పాటు చేసి కమిటీ ఎన్నికలు నిర్వహించి తద్వారా వడ్డెర సౌకర్యాలపై పోరాటం సాగిద్దాం అన్నారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెర వృత్తిదారులకు పనిముట్లు, సంక్షేమ పథకాల తోపాటు వడ్డెర కమ్యూనిటీ భవనం నిర్మాణం తోపాటు వడ్డెర జాతి ఆశాజ్యోతి వడ్డే ఓపెన్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. వడ్డెర సంఘం ఏర్పాటుకు వడ్డెర్లు విరివిగా విరాళాలు ఇచ్చి ఐక్యత చాటుకోవాలన్నారు. ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలం కోసం జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రతి వడ్డెర కులస్తుడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపు శివకేశవ, మహిళా నాయకురాలు రామ లక్ష్మమ్మ, డేరంగుల మనోహర్, తేపల్లె రెడ్డప్ప, డి వేమనారాయణ, ఒలిపి రవికుమార్, వెంకటాచలపతి, దేవరింటి సామి రెడ్డి, పల్లపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: