నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె మండలం పరసతోపు పంచాయతీ సచివాలయ ఆవరణంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆర్డబ్ల్యూఎస్ ఎఈఈ వినోద్ కుమార్ మరుగుదొడ్డి నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టుకు సచివాలయం లో మూడు లక్షలతో మరుగుదొడ్లు, తంబళ్లపల్లె మండల కేంద్రంలో మరుగుదొడ్డి మరమ్మత్తు చేపడతామన్నారు. మండలంలో ఈ వేసవి లో తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపట్టామని మండల అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్,పంచాయతీల నిధులతో తాగునీటి సమస్యలు అధికమిస్తామని తెలిపారు. ఆయన వెంట పరుసతోపు సచివాలయ అధికారులు, టిడిపి నాయకుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News