Thursday, 30 July 2026 10:29:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రభుత్వం అభివృద్ధి పథకాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలి - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

Date : 18 February 2026 08:07 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 18 : ప్రభుత్వం అభివృద్ధి పథకాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మదనపల్లి కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మదనపల్లి సబ్ కలెక్టర్, రాయచోటి, పీలేరు ఆర్డీఓ, తహశీల్దార్లు, ఏడి సర్వే , డి.పి.ఓ , జిల్లా వ్యవసాయ అధికారి, డి.ఎల్.పి.ఓ , డి.ఎల్.డి.వో , డి.ఎ.వో లు, డిప్యూటీ ఎంపీడీవోలు, మరియు మండల సర్వేయర్లు, ఏ.డి.ఏ లు, ఎం.ఏ.ఓ లతో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులతో పి.పి.బి. ల పంపిణీ మరియు మొబైల్ యాప్‌లో డ్రాఫ్ట్ పి.పి.బి ల ఈ కేవైసీ పంపిణీ, ఇతరులు, భూసేకరణ మరియు భూమి పరాయీకరణ పెండింగ్ సమస్యలు, అందరికీ గృహనిర్మాణం - ఖాళీ ప్లాట్ల నవీకరణ, ఇంటి స్థల దరఖాస్తు స్థితి, ఎఫ్. లైన్ దరఖాస్తులు, లావాదేవీ కోసం దిద్దుబాటు మరియు మ్యుటేషన్ కోసం ఉత్పరివర్తనలు, రీసర్వే - దశ 2 మరియు 3,స్వామిత్వ , పి.జి.ఆర్.ఎస్, ఆడిట్ మరియు డిస్పోజల్లు, తదితర అంశాలపై డిఆర్ఓ మధుసూదన్ రావు తో కలిసి జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న ఎం.ఎస్.ఎం.ఈ పార్కులు, పర్యాటక సంబంధిత ప్రధాన ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు మరియు హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే కు సంబంధించిన రెండవ దశ, మూడవ దశ పనులను జాయింట్ ఎల్.పి.ఎం సమస్యలు తలెత్తకుండా నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. స్వామిత్వ పనులలో పురోగతి సాధించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పిజిఆర్ఎస్ సంబంధిత ఆర్జీలను అర్జీ దారునితో సంప్రదించి వారితో మాట్లాడి నాణ్యతతో సరైన ఎండార్స్మెంట్ చేస్తూ పరిష్కరించాలని అన్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. హౌసింగ్ శాఖపై సమీక్షిస్తూ ఎన్టీఆర్ హౌసింగ్- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను త్వరిత గతిన పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం వంటి ప్రయోజనాలు అందించడానికి ఇక్రాప్ ల్యాండ్ పార్శిల్ బుకింగ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని నిర్దేశించిన గడువు లోపల లక్ష్యాన్ని చేరుకునే విధంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకొని పనిచేయాలని అధికారులకు సూచించారు

ఈ సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు,ఏడి సర్వేయర్ భరత్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ,డిపిఓ రాధమ్మ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్. సి చంద్రశేఖర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :