Saturday, 01 August 2026 12:30:37 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫసర్ మారుతీ ప్రసాద్ కు డాక్టరేట్

యాన్ ఇంటెలిజెంట్ మల్టీమోడల్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఐఓటి డాక్టరేట్ ప్రధానం చేసిన సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ

Date : 17 November 2025 04:31 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 17 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిషన్స్) మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి మారుతి ప్రసాద్ కు తమిళనాడు రాష్ట్రము లోని చెన్నైలో గల సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారు డాక్టర్ పట్టాను అందజేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగము నుండి పిహెచ్‌డి డిగ్రీ పొందినట్లు, అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ బి. భారతి పర్యవేక్షణలో "యాన్ ఇంటెలిజెంట్ మల్టీమోడల్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఐఓటి" అను అంశం పై చేసిన పరిశోధన కు గాను డాక్టర్ పట్టా ను అందజేసినట్లు ఆయన అన్నారు. వి.మారుతీ ప్రసాద్ ను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :