Friday, 31 July 2026 01:38:50 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఐపీఎల్ పేరుతో జూదం ఆడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

క్రికెట్ బుకీలు, ఆన్ లైన్ జూదగాళ్ళ పై ప్రత్యేక నిఘా

Date : 28 March 2026 10:53 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28: నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న సందర్భంగా, అన్నమయ్య జిల్లా ప్రజలను హెచ్చరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి శనివారం ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, క్రికెట్‌ను కేవలం క్రీడలాగే చూడాలని ఆయన పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆశకు పోయి జీవితాన్ని పాడుచేసుకోవద్దంటూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని బుకీలు చెప్పే మాటలు నమ్మకండి. బెట్టింగ్ అనేది ఒక విషవలయం. ఒక్కసారి అందులో పడితే అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం రోడ్డున పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని తెలిపారు. బుకీలకు చెక్ పెట్టాలి, అమాయక విద్యార్థులను, యువతను ఆకర్షించే బుకీల ఆటలు సాగనివ్వమని, అక్రమాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ జూదగాళ్లపై నిఘా పెట్టాం స్మార్ట్‌ఫోన్లలో సీక్రెట్ యాప్స్, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రతి పైసా లావాదేవీని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు, యువత జాగ్రత్త గా ఉండాలి సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మీ కెరీర్‌ను దెబ్బతీస్తుంది. పోలీస్ కేసు నమోదైతే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని ఎస్పీ గారు సూచించారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి:* మీ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా? అనేది గమనించండి. వారి బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పదంగా డబ్బులు కట్ అవుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి

ప్రజలు సహకరించాలని తెలియచేస్తూ మీ ప్రాంతంలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :