నమిత న్యూస్ - Andhra Pradesh / Hyderabad : హైదరాబాద్ - ఫిబ్రవరి 07 : ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదం లో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేసాము. ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ఉద్యోగి మాత్రమే లోపల ఉన్నారు. మంటలు గమనించి సురక్షితంగా బయటికి వచ్చారని తెలిపిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి
Admin
Namitha News