Friday, 31 July 2026 01:02:14 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు

Date : 17 April 2026 07:49 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు ఉపాధి అవకాశాలను పెంచి వలసలను నివారించడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రారంభమైన అన్నమయ్య జిల్లా మొదటి మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలకు మండం సుధీర్ కుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలు వ్యవసాయ కార్మికులుగా జీవనం సాగిస్తున్నాయని, వీరంతా భూమిలేని నిరుపేదలేనని తెలిపారు. శారీరక కష్టాన్ని ఆధారంగా చేసుకుని జీవించే ఈ వర్గానికి భూపంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ కూలీలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని, గతంలో 10 శాతం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పుడు 40 శాతం భారం రాష్ట్రాలపై పడుతోందన్నారు. కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇవ్వడం, అవి కూడా ఆలస్యంగా విడుదల కావడం వల్ల పథకం అమలు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం కొనసాగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులో ఉన్నప్పటికీ భూస్వాముల సంఖ్య పెరుగుతోందని, పాలకవర్గాలే భూస్వాములుగా మారుతున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని, ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం సంఘం శక్తివంచన లేకుండా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు హరి శర్మ సంఘీభావం ప్రకటిస్తూ వ్యవసాయ కార్మికులకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ప్రతినిధులు మహాసభల్లో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :