Thursday, 30 July 2026 06:06:39 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భూముల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం గోపిశెట్టిపల్లె రైతులు

గోపిశెట్టిపల్లె రైతులు కలెక్టరేట్ ముట్టడి

Date : 25 May 2026 07:26 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భూముల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం గోపిశెట్టిపల్లె రైతుల కలెక్టరేట్ ముట్టడి “భూమాతను నమ్ముకొని బతుకుతున్నాం.. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ భూములను మాత్రం వదులుకోలేం” అంటూ పుంగనూరు మండలం మేలుందొడ్డి పంచాయతీ గోపిశెట్టిపల్లె రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ జీవనాధారమైన సాగుభూములను భూసేకరణ పేరుతో తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వచ్చిన మాజీ డీఎస్పీ, వాల్మీకి నాయకులు సుకుమార్ బాబు మాట్లాడుతూ గోపిశెట్టిపల్లెలో సుమారు 135 కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఒక్కో కుటుంబానికి ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు మాత్రమే సాగుభూమి ఉందన్నారు. 2023లో అప్పటి ప్రభుత్వం పెప్పర్ మోషన్స్ బస్సుల కంపెనీ ఏర్పాటుకు రైతుల భూములు సేకరించేందుకు ప్రయత్నించిందని, రైతుల నిరసనలతో అది నిలిచిపోయిందన్నారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో రైతులంతా ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తం గ్రామంలో సర్వే చేపట్టడంతో రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైందన్నారు. వెంటనే కలెక్టర్, సబ్ కలెక్టర్‌ను కలిసి తమ భూములను తీసుకోవద్దని, తమ కుటుంబాలను వీధిన పడేయొద్దని వేడుకున్నామని తెలిపారు. పరిశ్రమలు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పంటలు పండే సస్యశ్యామల భూముల్లో కాకుండా సమీపంలోని బీడు భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు శంకరప్ప, చిన్నపయ్య, మునియప్ప, వెంకటరమణ, ఆనంద్, వీరేంద్ర, భాస్కర్, లక్ష్మీదేవి, శంకరమ్మ, అలివేలమ్మ, శ్రీనివాసులు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: