నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 08 : రామసముద్రం మండలకేంద్రంలోని దిగువ పేట లో కొలువైన శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలోసంకట హర చతుర్థి పూజ ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజున స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి, మల్లిఖార్జున స్వామి ఉదయం ఆలయ శుద్ధి చేసి స్వామి మహా గణపతి,శ్రీ పార్వతిసమేత చంద్రశేఖర స్వాముల వారికి పంచామృత రుద్రాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వామివారికి పలు రకాల పుష్పాలతో స్వామివార్లని అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్దకురప్పల్లె గ్రామపంచాయతీ దిగవూరు వాసుదేవరెడ్డి కుమారుడు సాగర్ రెడ్డి వివాహం జరిగిన సందర్బంగా చంద్రశేఖర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.స్వామివారిని దర్శించుకున్న బాబు రెడ్డి, మనోహర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సాయి తదితరుల భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News