నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : తంబళ్లపల్లె మండలంలో గతంలో జరిగిన జె ఎస్, జే బీ లో చేపట్టిన ఉపాధి పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అనిల్ ప్రశంసించారు. గత రెండు రోజులుగా అనిల్, డ్వామా జేఈ నాగరాజులు మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, జుంజురపెంట, గోపిదిన్ని, గుండ్లపల్లి, దిగువపాలెం, గంగిరెడ్డిపల్లి, తంబళ్లపల్లె, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి, ఎద్దులవారిపల్లి పంచాయతీలలో చేపట్టిన 90 జె ఎస్, జేబీ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ లో చేపట్టిన ఉపాధి పనులు ట్రెంచీలు, ఫారం పాండ్స్, మొక్కలు పెంపకం పనులను అక్షాంశ, రేఖాంశ ల ద్వారా ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. మండలంలో చేపట్టిన పనులు ఎక్కడ పారదర్శకత లోపం కానురాక పోవడం విశేషం. ఈ సందర్భంగా సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అరుణ్ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన 90 పనులను తనిఖీ చేశామని సక్రమంగా ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో 1211 జె ఎస్, జేబీ పనుల కు గాను 234 పనులను తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. మిగతా పనులను సైతం త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వారి వెంట ఏపిఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, క్షేత్ర సహాయకులు నరసింహులు, రమేష్, గోబ్రే నాయక్, రాణి, అశోక్, చాంద్ భాషా, వేమ నారాయణ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News