Thursday, 30 July 2026 11:24:44 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అన్నమయ్య జిల్లా సీపీఐ సివిల్ సప్లై శాఖ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి

Date : 07 December 2025 09:27 AM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప ఆధ్వర్యంలో సివిల్ సప్లై శాఖ సమావేశంలో కృష్ణప్ప మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని అయన సేవలను కొనియాడి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కృష్ణప్ప మాట్లాడుతూ అంటరానితనం, వివక్ష, సామాజిక బానిసత్వ, ఇవన్నీ విధ్వంసం చేసిన మహానుభావుడు అంబేద్కర్. ఆయన మాటలు కోట్ల మందికి బలం అయ్యాయి. కానీ నేడు ఆ అంబేద్కర్ చూపించిన దారిని ప్రభుత్వం మోసం చేస్తోంది.అణగారిన వర్గాల హక్కుల మీద కోతలు, సంక్షేమంపై దాడులు, రిజర్వేషన్లపై రాజకీయాలు… ఇవన్నీ అంబేద్కర్ ఆత్మను కలిచివేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. సమానత్వాన్ని కలగా మార్చిన అంబేద్కర్… నేడు ఆ సమానత్వాన్ని ప్రభుత్వం నినాదంగా మార్చింది, వాస్తవానికి దూరం చేసిందన్నారు. అదేవిధంగా సివిల్ సప్లైల్లో అవినీతి, దోపిడీ వల్ల పేదల బియ్యం కూడా సురక్షితం కాకపోవడం, పనిచేస్తున్న హమాలీలకు తగు సమయంలో జీతాలు ఇవ్వకపోవడం అత్యంత సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అణగారినవారి హక్కులను రక్షించకపోతే CPI వీక్షకుడిలా నిలబోదు – పోరాటం మరింత కఠినమవుతుంది. సివిల్ సప్లై వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. రేషన్ వ్యవస్థ పేదల బతుకుదెరువు—దాన్ని చెడగొట్టే వారిని CPI సహించదన్నారు.” వారు అధికారులను పాలక నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి తిరుమలప్ప, ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాయికిరణ్, సివిల్ సప్లై యూనియన్ కార్యదర్శి గంగులప్ప సివిల్ సప్లై హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: