Saturday, 13 June 2026 09:57:40 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి - నిస్సార్ అమ్మద్‌ డిమాండ్

Date : 09 June 2026 05:59 PM Views : 36

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఘోరప్రమాదం హృదయ విదారకం - మృతుల కుటుంబాలకు రూ.కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి - మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిస్సార్ అమ్మద్‌ డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోరప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంగళవారం మదనపల్లె అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి,మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్.రెడ్డితోకలిసి మాట్లాడారు.నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్.ఎం.ఎస్ -2)లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి,వారి ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం బాధకరమని వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి,గాయపడిన వారికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలు పరిహారం ప్రకటించడాన్ని తప్పు పట్టారు.జగన్మోహన్ రెడ్డి సిఎంగా వున్న సమయంలో పాలిమర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే రూ.కోటి పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని,భద్రతా ప్రమాణాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ప్రయివేటుపరం చేయాలని చూస్తూ తీవ్ర వ్యతిరేకత రావడంతో అరకొర సిబ్బందితో స్టీల్ ప్లాంట్ నడుపుతోందన్నారు.ఉన్న సిబ్బంది అదనపు పని భారంతో తీవ్ర ఆందోళన మధ్య పనిచేస్తున్నారని ఆరోపించారు.సిబ్బందిని పెంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :