నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 19 : పుంగనూరు పట్టణం లోని భాష్యం పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రం,సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి కి చెందిన తల్లితండ్రులు అధిక ఫీజు లకు తోడు పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు కొనాలాంటూ హుకుం చేశారన్న సమాచారం తో విద్యార్ధి సంఘాలు ఆందోళన ఉపక్రమించారు. మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు తో ఎంఈఓ నటరాజ, రెడ్డన్న శెట్టి లు పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీస్ చేయడం జరిగిందని వారు తెలిపారు. డిఇఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ లు నటరాజ, రెడ్డన్న శెట్టి లు తెలిపారు
Reporter
Namitha News