Friday, 31 July 2026 08:50:52 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ విద్యార్థులకు పరిశ్రమలు, అవసరాల పై శిక్షణ కు ఒప్పందం

Date : 15 March 2026 07:10 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 15 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అల్యూమిని రిలేషన్స్ సెల్ మరియు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట ఇంటరాక్షన్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన కోడ్ 2 ఏ.ఐ కెరీర్ సంస్థ సీఈఓ మరియు యూనివర్సిటీ ఈ సి ఈ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు అయిన నిషా రెడ్డి, ఎస్‌పీఓసీ జయశ్రీ.డి లు మరియు విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) మరియు ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నూతన సాంకేతికతలు కమ్యూనికేషన్ సిస్టమ్స్, స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IIoT) వంటి రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, విద్యార్థులు ఈ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు మిట్స్ యూనివర్సిటీ శిక్షణ మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిచేందుకు కృషిచేస్తున్నదని అన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగ శ్వేతా, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :