Friday, 31 July 2026 01:01:54 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రామసముద్రం లో బేటీ బచావో, బేటీ పఢావో

Date : 17 November 2025 07:54 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ పై సోమవారం వెలుగు కార్యాలయంలో సీడీపీఓ నాగవేణి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ప్రజలకి అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా పథకం లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలన్నారు. మండలంలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా బేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లీబిడ్డల సంరక్షణ అంశాలపై ప్రతి గ్రామంలో వర్క్‌ షాప్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు నియంత్రణపై పాఠశాలల్లో, కమ్యూనిటీ సెంటర్స్‌ వంటి జన సమూహం గల ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరిగే సమాచారం క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి తెలుసుకునే అవకాశం ఉందని, సామాజిక బాధ్యతతో అటువంటి వాటిని బహిర్గతం చెసేలా ప్రతీ ఒక్కరికీ అవగాహనా కల్పించాలన్నారు. గృహ హింస కేసుల్లో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెమినార్స్‌, వర్క్‌షాప్స్‌, ఎగ్జిబిషన్స్‌, ర్యాలీలు, వక్తలు ప్రసంగాలు, ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహిస్తున్న నెలసరి పనితీరుపై సమీక్షలు పక్కగా నిర్వహించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాలల అక్రమ రవాణాపై చట్టాల గురించి అవగాహన కల్పించారు. కిషోర బాలికలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి వివరించారు. పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్‌ వాష్‌ ప్రాధాన్యత వివరించారు. కాచి చల్లార్చిన నీరే తాగాలని, బాల్య వివాహాలను అరికట్టాలని వివరించారు. బాలికలకు జీవించే హక్కు, చదువుకునే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సూపర్వైజర్‌ రమాదేవి, ఎంపీడీఓ,ఎసై,తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :