Thursday, 30 July 2026 10:14:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో జాతీయ స్థాయి టెక్నీకల్ సింపోజియం

ముఖ్య అతిథిగా కవిత సురేష్ కుమార్, ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డైరెక్టర్, కిండ్రిల్

Date : 31 March 2026 05:24 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 31 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత సురేష్ కుమార్, ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డైరెక్టర్, కిండ్రిల్, బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తాజా టెక్నాలిజీ పై విద్యార్థులు అవగాహాన పెంచుకోవాలని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు – విద్యార్థుల సిద్ధత అనే అంశంపై అవగాహన కల్పించారు. కోడింగ్ నైపుణ్యాలతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కరణ, బాధ్యత, అనుకూలత మరియు జట్టు సహకారం వంటి గుణాలు అవసరమని అన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం, గ్రూప్ డిస్కషన్లలో పాల్గొనడం, ఫారెన్ ల్యాంగ్వేజ్స్ నేర్చుకోవడం మరియు కొత్త ఆవిష్కరణల కోసం అధ్యాపకుల మార్గదర్శకత్వం తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు మైక్రోసాఫ్ట్ టూల్స్, క్లౌడ్ కంప్యూటింగ్ (Azure), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో లోతైన జ్ఞానం పొందగలుగుతారు. ప్రాజెక్టులు, హ్యాకథాన్‌ల ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందటంతో పాటు, నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి అని అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్స్ ద్వారా మెంటోరింగ్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు స్టూడెంట్స్ క్లబ్ ద్వారా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ రంగంలో ఎదగడానికి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది అని అన్నారు. ప్రతి విద్యార్ధి జాబ్ కావాలంటే లెర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలిటీలు తప్పనిసరని ఆమె అన్నారు. ప్రాంప్ట్ కంప్యూటింగ్ స్కిల్స్ పై శ్రద్ధవహించాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన “ది లాస్ట్ పఫ్” అనే అవగాహన షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ధూమపానం మరియు మద్యపానం వల్ల కలిగే హానికర ప్రభావాలను ప్రతిబింబిస్తూ, సమాజానికి మంచి సందేశాన్ని అందించారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ దినేష్, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు, కన్వీనర్ డాక్టర్ ఎస్. ఝాన్సీ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :