Friday, 31 July 2026 07:40:37 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

Date : 03 May 2026 07:38 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 03 : మదనపల్లి పట్టణం సమీపం అంగళ్ళు లో నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశం కొరకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను ఘనంగా నిర్వహించామని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షకు సుమారు 2000 మంది విద్యార్థులు 9 కేంద్రాలలో హాజరై పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. మదనపల్లె, కడప, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, చిత్తూర్, తిరుపతి, హిందూపూర్ మరియు విజయవాడ కేంద్రాలలో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ లోని వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, చాకచక్యంగా పరీక్షలో పాల్గొన్నారని ఆయన అభినందించారు. ఈ పరీక్షను ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో, ప్రతి సెషన్ రెండు గంటల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షా నిర్వహణలో సాంకేతిక మరియు పరిపాలనా సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉపకులపతి పేర్కొన్నారు. అలాగే ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకానాథ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథం, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొని పరీక్ష నిర్వహణ లో పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: