నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డ్యామ్ ఇంజినీరింగ్‌పై అవగాహన పొందిన విశ్వం ఇంజినీరింగ్ కళాశాల సివిల్ విద్యార్థులు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లిలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు 31.01.2026 న తిరుపతిలో ఉన్న కల్యాణి డ్యామ్‌ను విద్యా సందర్శన (Field Visit) చేశారు. ఈ సందర్శన సందర్భంగా విద్యార్థులకు డ్యామ్ యొక్క సాధారణ పరిచయం నుంచి నిర్మాణ విధానం, నీటి నిల్వ సామర్థ్యం, నీటి విడుదల వ్యవస్థ, భద్రతా చర్యలు, నిర్వహణ విధానం వంటి అన్ని సాంకేతిక అంశాలపై సవివరంగా అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) శ్రీ సుదీప్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది. ఆయన విద్యార్థులకు ఎంతో ఓర్పుతో, స్పష్టంగా ప్రతి అంశాన్ని వివరించడం వల్ల ఈ సందర్శన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మరియు విలువైన అనుభవంగా నిలిచింది. ఈ విద్యా సందర్శన ద్వారా విద్యార్థుల్లో డ్యామ్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి పెరిగి, వాస్తవ పరిస్థితుల్లో నిర్మాణ ప్రాముఖ్యతను అర్థం చేసుకునే అవకాశం లభించింది. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధ్యాపకులు పేర్కొన్నారు
Reporter
Namitha News