నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకి పురం : కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల నిమిత్తం వాల్మీకిపురం మండలం చింతపర్తికి వచ్చింది. స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేసుకుని జీవిస్తోంది. అక్కడే పనులు చేసే శ్రీనుకు చెందిన ద్విచక్ర వాహనంపై లక్ష్మీదేవి, నాగరాజు, సుగుణమ్మ కలిసి శుక్రవారం చింతపర్తిలో మద్యం తాగారు. సుగుణమ్మ మద్యం మత్తులో ఉండగా, నాగరాజు తాను తెచ్చిన ద్విచక్ర వాహనంలో లక్ష్మీదేవిని ఎక్కించుకుని నిమ్మనపల్లె మార్గంలో వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో కానీ.. పెద్ద బండరాయితో లక్ష్మీదేవి తలపై కొట్టి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందడంతో సీఐ రాఘవరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు
Reporter
Namitha News