నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 10 : తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దండువారిపల్లెలో శనివారం తంబళ్లపల్లె పుడమి ఏజెన్సీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ముగ్గుల పోటీల విజేతలకు పుడమి ఏజెన్సీ రాజు, మేనేజర్ మాధవ్ కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు వెంకటరమణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తో పాడి పంటలతో రైతులు తులతూగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎద్దులవారిపల్లి పంచాయతీ కి చెందిన మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News