నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 21 ః తంబళ్లపల్లె మండలం కుక్క రాజు పల్లి పంచాయతీ డంపింగ్ యార్డ్ ను ఎంపీడీవో ఉషారాణి మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం ఆమె డిప్యూటీ ఎంపీడీవో ఎం బి ప్రసాద్ తో కలిసి కుక్క రాజు పల్లి గ్రామంలో పర్యటించి పారిశుధ్యం నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం డంపింగ్ యార్డ్ ను పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువు గా తయారు చేయడానికి గ్రీన్ అంబాసిడర్లు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలో పర్యటిస్తున్న స్వచ్ఛరథం నిర్వహణపై ఆరా తీసి స్థానిక ప్రజలకు పనికిరాని వస్తు సామాగ్రిని అప్పగించి అందుకు సరిపడా వస్తువులు తీసుకువెళ్లాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శి ఎప్పటికప్పుడు పారిశుధ్యం, తాగునీరు, వైద్యం పై ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ఆమె వెంట పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News