Friday, 31 July 2026 03:53:16 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నిమనపల్లి లో కరెంట్ షాక్ కొట్టి మరో రైతు బలి

నిన్న మదనపల్లి నేడు నిమ్మనపల్లి లో మృతులు

Date : 21 December 2025 07:20 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో కరెంట్ షాక్ కొట్టి రైతు మృతిచెందిన ఘటన మరువకనే నిమనపల్లిలో కరెంట్ షాక్ కొట్టి మరో రైతు బలి... మదనపల్లి మండలం, ఎనమలవారిపల్లి వద్ద శనివారం ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి నేల వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకి రైతు చంద్రశేఖర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన మరువకనే ఆదివారం నిమనపల్లి మండలం, ముస్టూరు పంచాయతీ, దిగువపల్లిలో కొబ్బరి చెట్టుకి కాయలు కోస్తున్న యువ రైతు శ్రీనివాసులు కు కింద వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టి చెట్టు పైనే మృత్యువాత చెందాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రైతులు కరెంటు షాక్ కొట్టి చనిపోవడంతో జిల్లాలో ట్రాన్స్కో అధికారుల తీరు తీవ్ర చర్చిని అంశంగా మారింది. ట్రాన్స్కో అధికారులు రైతుల పొలాల వద్ద ఉన్న లైన్లను పరిశీలించక పోవడం, లైన్ మ్యాన్లు విద్యుత్ లైన్ల ను పర్యవేక్షించడంలో చిత్తశుద్ధి లేకపోవడం. ఈ రెండు సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా మారాయి. ఇవే కాకుండా వన్యప్రాణులను వేటాడడానికి వేటగాళ్లు తీసిన కరెంటు ఉచ్చులో చిక్కుకొని మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు ఏడాది వ్యవధిలోనే విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారు. మన పల్లెలో రైతు కరెంట్ షాక్ తో మృతి చెందడం పట్ల తెలుగుదేశం శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు... ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లైన్మెన్లు, ఏఈలను రైతుల చావుకు బాధ్యులను చేస్తూ.. కేసులు నమోదు చేసి, ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: