Friday, 31 July 2026 04:54:02 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఎన్‌హెచ్‌-71 పెండింగ్ పరిహార చెల్లింపుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

ప్రభావిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు - జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ

Date : 29 May 2026 08:28 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామ పరిధిలో మదనపల్లి – పీలేరు సెక్షన్‌కు సంబంధించిన ఎన్‌హెచ్‌-71 రహదారి పనుల్లో పెండింగ్‌లో ఉన్న పరిహార చెల్లింపుల అంశాలను శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ మరియు ఎన్‌హెచ్‌-71 సైట్ ఇంజినీర్‌తో కలిసి సంబంధిత ప్రాంతాలను సందర్శించి భూ స్వాధీనం, పరిహార చెల్లింపులు, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభావిత రైతులు, భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులను తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించారు. భూ స్వాధీనం కారణంగా ప్రభావితమైన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల అంశాలను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారికి ఆలస్యం లేకుండా పరిష్కారం కల్పించాలని ఆదేశించారు

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రహదారి అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజల అభ్యంతరాలు, సమస్యలను సానుభూతితో పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని సూచించారు

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :