నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం - 14వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తోందని టిడిపి నేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు శనివారం 14వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.ఎన్టీఆర్ భరోసాతో అవ్వ తాతలు,వికలాంగులు,ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు,అన్నదాత సుఖీభవతో రైతులకు,స్త్రీ శక్తితో మహిళలకు,తల్లికి వందనంతో విద్యార్థులకు,ఎన్టీఆర్ గృహకల్పతో మధ్యతరగతి వారికి,అన్న క్యాంటీన్లతో నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఏపీ,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కొనియాడారు.కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Reporter
Namitha News