Friday, 31 July 2026 06:51:50 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ యూనివర్సిటీ లో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

Date : 22 December 2025 05:51 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు గణిత శాస్త్ర విభాగము వారు ఆదర్శనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ కె కొమరగిరి మరియు మ్యాథమెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ పి.రమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. గణితశాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలన్నారు. గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి మూలస్తంభం అని, మానవ నాగరికత పురోగతికి కూడా గణితం కొంతవరకు కారణమని చెప్పొచ్చు అని అన్నారు. న్యూమరాలజీ వంటి అనేక ఆధునిక ఉపన్యాసాలు గణితశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఈ ఘనత శ్రీనివాస రామానుజన్‌కే చెందుతుంది అని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు అని, ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కర 2, శ్రీనివాస రామానుజన్ వంటివారు గణితశాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం, అమోఘం అన్నారు. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్య్ జీనియస్ (Maths Genius)గా చరిత్రలో నిలిచి పోయారు అని అన్నారు. ఆయన జీవితం ఆధారంగా ‘ద మ్యాన్‌ హూ నో ఇన్ఫినిటీ’ (The man who know infinity) పేరుతో సినిమా కూడా వచ్చింది అని అన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రం పై పట్టు సాధించాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యకమం లో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :