Thursday, 30 July 2026 06:10:46 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో గాలివాన బీభత్సం

విద్యుత్ అంతరాయం-శరవేగంగా స్పందించిన విద్యుత్ ఉద్యోగులు

Date : 01 May 2026 08:02 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : తంబళ్లపల్లి మండలంలో గురువారం సాయంత్రం నుండి గాలి వాన బీభత్సం సృష్టించి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి ఇన్సులేటర్లు దెబ్బతిని విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయాన్ని ముందస్తుగా గుర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి విద్యుత్ శాఖ ఏ ఈ సురేంద్ర తన సిబ్బందితో విద్యుత్ అంతరాయం, ఎక్కడ సమస్యలు ఏర్పడ్డాయి గుర్తించి హుటాహుటిన నివారణ చర్యలు చేపట్టారు. గోరంకొండ సబ్ స్టేషన్ నుండి తంబళ్లపల్లె మండలానికి సరఫరా జరిగే విద్యుత్ లైన్ లో నాలుగు ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా పంచాలమర్రి వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం ఈదురు గాలులకు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమతుల్లో భాగంగా విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, జేఎల్ఎం ప్రసాద్, అమీద్, ఏఎల్ఎంలు అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, శేషు, నాగేంద్ర, ఖాద్రి, సురేష్, డ్యూటీ ఆపరేటర్లు భాస్కర్, రాజశేఖర్, మధు లు గుర్రంకొండ సబ్ స్టేషన్ నుండి కన్నెమడుగు, గోపిదిన్నె సబ్ స్టేషన్ ల వరకు శుక్రవారం విద్యుత్ మరమ్మత్తు పనులు శరవేగంగా నిర్వహించి పనులు పూర్తి చేయడంతో విద్యుత్ సరఫరా కొనసాగడానికి సులభతరమైంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :