నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 ః ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ తాగునీటి సరఫరా పైప్ లైన్ పనులను అడ్డుకోరాదని ఈ సత్కార్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ.ఈ చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం మండలంలోని కోటకొండ నుండి మండెంవారిపల్లెకు జలజీవన్ లో వేస్తున్న పైప్ లైన్ పనుల కాంట్రాక్టర్లను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డి ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి హుటాహుటిన ఎఈఈలు దినేష్ కుమార్, వినోద్ కుమార్, డిపిఎం సంజయ్, జగన్నాథం, సైట్ ఇంజనీర్లతో సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత అడ్డుకున్న రైతులతో మాట్లాడారు. జలజీవన్ తాగునీటి పథకం పై వారికి అవగాహన కల్పించి ఇలాంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోరాదని చెప్పడంతో రైతులు చైతన్యం చెంది సంఘీభావం తెలపడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా డి ఈ ఈ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తయితే ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందుతాయని ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి సహకరించాలని సూచనలు చేశారు. అనంతరం మండలంలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి చొరవ చూపాలని ఏఈఈ వినోద్ కుమార్ కు సూచించారు. తీవ్రంగా తాగునీటి సమస్యలుంటే యుద్ధ ప్రాతిపదికన వాటర్ ట్యాంకర్ల ల తో నీరు తరలించి సమస్య పరిష్కరించాలన్నారు. అదేవిధంగా మండలంలో ప్రారంభమైన జలజీవన్ మిషన్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలు నాణ్యత లోపం లేకుండా త్వరగా పనులు జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట కోటకొండ పంచాయతీలోని అధికార పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News