నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం కావాలి... ప్రజలు మెచ్చిన పరిపాలన రావాలి.... జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు పాలేటి గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి -- పాలేటి గంగమ్మ తల్లి జాతర ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మదనపల్లె నియోజకవర్గం మదనపల్లె మండలం చిప్పిలి జరుగుతున్న పాలేటి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్నారు. చిప్పిలి గ్రామస్థులు, స్దానిక YSRCP నాయకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేసినారు. నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం కావాలని, ప్రజా ప్రభుత్వం వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు పాలేటి గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు నిస్సార్ అహమ్మద్ తెలిపారు. పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్దిగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పూజ కార్యక్రమాల అనంతరం కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు స్వగృహాలకు వెళ్ళి వారి ఆతిధ్యం స్వీకరించారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News