Friday, 31 July 2026 12:08:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ

వీరి జీవిత భాగస్వాముల త్యాగం వెలకట్టలేనిదన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 30 May 2026 06:34 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 30: సమాజ రక్షణ కోసం దశాబ్దాల కాలం పాటు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవలందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి కొనియాడారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఏఎస్ఐలకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఒక పోలీసు అధికారి సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వామి పాత్ర, భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నాటి రోజుల్లో నేటి వలె అత్యాధునిక వసతులు లేకపోయినా, రకరకాల ఇబ్బందులను తట్టుకుని, కుటుంబానికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడంలో సతీమణులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రోజులు విధి నిర్వహణకే అంకితమై సమయాన్ని, శక్తిని వినియోగించారని, ఇకపై శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి సంతోషంతో, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు

పదవీ విరమణ పొందిన వారిలో కలికిరి పీఎస్ ఏఎస్ఐ ఎస్. మాబూ సాహెబ్ (35 ఏళ్ల సర్వీస్), రామాపురం పీఎస్ ఏఎస్ఐ పి. వెంకటరమణ (35 ఏళ్ల సర్వీస్), మరియు రైల్వేకోడూరు పీఎస్ ఏఎస్ఐ ఎం. శేఖర్ రావు (33 ఏళ్ల సర్వీస్) ఉన్నారు. వీరికి ఎస్పీ గారు జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దశాబ్దాలుగా మమేకమైన పోలీసు శాఖను, తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో అటు సంతోషం, ఇటు దుఃఖం కలగలిసిన భావోద్వేగాల నడుమ రిటైర్డ్ అధికారులు కన్నీరు కార్చారు. తమను ఇంత గౌరవంగా సత్కరించడం జీవితంలో మరువలేమంటూ ఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, ఏఏఓ పి. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎం. రవికుమార్, కె. సురేష్ కుమార్ రెడ్డి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: