Tuesday, 09 June 2026 09:49:27 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

ఐ.యస్.టి.ఈ. సహకారం తో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

Date : 15 December 2025 09:04 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 15 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెల్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టీ.ఈ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంశంపై ఆరు రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఢిల్లీకి చెందిన ఎంబెడెడ్ సిస్టమ్స్ ట్రైనీ ఇంజనీర్ షరీఫ్ షేక్, ఐలిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇవి ప్రత్యేకమైన పనులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా మరియు విశ్వసనీయంగా నిర్వహించేందుకు రూపొందించబడిన కంప్యూటింగ్ సిస్టమ్స్ అని అన్నారు. గృహోపకరణాలు వంటి వాషింగ్ మెషిన్‌లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు నుంచి ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే ఇంజిన్ కంట్రోల్ యూనిట్లు, ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్స్ వరకు ఎంబెడెడ్ సిస్టమ్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. పరిశ్రమల్లో ఆటోమేషన్, రోబోటిక్స్, ప్రాసెస్ కంట్రోల్ వంటి రంగాల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉత్పాదకతను పెంచుతూ ఖర్చులను తగ్గిస్తున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అల్గారిథంలను నేరుగా పరికరాల్లోనే అమలు చేయడానికి అవసరమైన హార్డ్‌వేర్–సాఫ్ట్‌వేర్ వేదికను ఎంబెడెడ్ సిస్టమ్స్ అందిస్తున్నాయి. సెన్సర్లు, మైక్రోకంట్రోలర్లు, ప్రాసెసర్లు మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ సామర్థ్యాల సహాయంతో డేటాను రియల్ టైమ్‌లో సేకరించి, విశ్లేషించి, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతోంది. దీంతో క్లౌడ్‌పై ఆధారపడకుండా వేగవంతమైన మరియు భద్రమైన కృత్రిమ మేధస్సు అప్లికేషన్లు అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీలు, స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక భావనలకు ఎంబెడెడ్ సిస్టమ్స్ పునాదిగా నిలుస్తున్నాయి. ఈ కారణంగా ఎంబెడెడ్ సిస్టమ్స్‌పై నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు పరిశ్రమల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండటంతో పాటు, భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధిలో ఇవి మరింత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఏ.వి పవన్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ వి బి తురై రాజ్, కోకోర్డినేటర్స్ డి కార్తీక్, డాక్టర్ టీ ఎస్ బాలాజీ దామోదర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :