Friday, 31 July 2026 01:50:28 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ యన్.సి.సి. క్యాడేట్ల కు ఎయిరోమోడలింగ్ డిజైన్ పై శిక్షణ

Date : 24 February 2026 10:13 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యన్.సి.సి. 11ఏ ఎయిర్ వింగ్ కేడెట్ల కోసం రెండు రోజుల పాటు ఎయిరోమోడలింగ్ డిజైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎయిరోమోడలింగ్ మరియు అడ్వెంచర్ శిక్షణలో నిపుణుడైన అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్, ఫ్లయింగ్ ఆఫీసర్ ఎం. రఘువీర కుమార్, బద్వేల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా కేడెట్లను జాతీయ స్థాయి వాయు సైనిక్ క్యాంపు (VSC) పోటీలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. విమానాల ప్రాథమిక సూత్రాలు, గాలి ఒత్తిడి, సమతుల్యత వంటి అంశాలపై అవగాహన పొందడం ద్వారా విమానయాన రంగంపై స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విమాన నమూనాల తయారీ మరియు ఫ్లయింగ్ నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఇటువంటి శిక్షణల ద్వారా కేడెట్లలో సాంకేతిక జ్ఞానం, క్రమశిక్షణ, టీమ్‌వర్క్ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ శిక్షణ భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్, విమానయాన ఇంజినీరింగ్ మరియు రక్షణ రంగాల్లో కెరీర్ అవకాశాలకు బలమైన పునాది అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, యెన్.సి.సి 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు యెన్.సి.సి ఎయిర్ వింగ్ క్యాడెట్ విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :